పదవి, అధికారం వచ్చిన తర్వాత ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మరిచిపోయే నాయకులే ఎక్కువగా కనిపిస్తున్న ఈ రోజుల్లో తరచూ నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే కనపడటం చాలా అరుదు. అటువంటివారే మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ.
ఆయన ఓ సొంత వాహనం, ఓ మొబైల్ యాప్ ఏర్పాటు చేసుకొని ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ పేరుతో ఇక నుంచి నియోజక వర్గంలో ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించబోతున్నారు. ఈ నెల 14 నుంచి వారానికి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో గ్రామలన్నీ పర్యటిస్తూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వీలైతే అక్కడికక్కడే పరిష్కరిస్తారు. ఆయనతో పాటు అధికారులను కూడా నియోజకవర్గానికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.