వివాదాలున్నాయి... జాతీయహోదా ఇవ్వలేం!

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

దీని కోసం తెలంగాణ ప్రభుత్వం 2022 సంవత్సరంలో కేంద్ర జలశక్తి శాఖకి ఫైల్ పంపించిందని, ఆ ప్రతిపాదనని లోతుగా అన్ని కోణాలలో పరిశీలించిన తర్వాత 2024 డిసెంబర్‌లో దానిని వెనక్కు తిప్పి పంపించామని జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లోక్‌సభలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దానిలో కృష్ణానది జలాల వినియోగం, వాటాలపై రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదాలున్నాయని, వాటిపై కృష్ణా ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నాయని కనుక ఈ ప్రాజెక్టు టెక్నికల్, సోషియో ఎకనామిక్ రిపోర్టుని పరిగణలోకి తీసుకొని జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసిందని కేంద్ర మంత్రి చెప్పారు.