జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలు పునర్విభజించాలనే కేంద్రం ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ తమిళనాడు సిఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్షాల అధినేతలతో నేడు చెన్నైలో సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి చెన్నై చేరుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు నిరంజన్ రెడ్డి, వినోద్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి చెన్నై చేరుకున్నారు. కేరళ, కర్ణాటక, పంజాబ్ ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొనేందకు చెన్నై వస్తున్నారు.
ఏపీలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కేంద్రం, బీజేపిలతో కలిసి సాగుతోంది కనుక ఈ సమావేశంలో పాల్గొనడం లేదు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి బీజేపి, కాంగ్రెస్ పార్టీలతో పొత్తులు లేవు. కానీ ఆ పార్టీ అధినేత జగన్‌పై అక్రమాస్తుల కేసులు ఉన్నందున కేంద్రానికి కోపం కలిగించే ఇటువంటి సమావేశాలకు దూరంగా ఉండవచ్చు.
చెన్నై చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
డీలిమిటేషన్‌పై రేపు తమిళనాడు CM స్టాలిన్ అధ్యక్షతన సమావేశం.
సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. pic.twitter.com/ijiKTSUSx2