ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు, దేశంలో మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ అమలుచేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకారమే ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల నివేదికని మంగళవారం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.
దీని కోసం ఏర్పాటు చేసిన జసిస్ట్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సంబందిత వర్గాల ప్రజలు, పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ చేసి నాలుగు సిఫార్సులతో 199 పేజీల నివేదికని ప్రభుత్వానికి అందజేసింది.
గ్రూప్-1: ఎస్సీ జనాభాలో 3.28 శాతంగా ఉండి అన్నివిధాలుగా వెనుకబడిన 15 కులాలకు ఒక్క శాతం రిజర్వేషన్లు లభిస్తాయి.
గ్రూప్-2: ఎస్సీ జనాభాలో 61.97 శాతం ఉన్న మాదిగలతో సహా 18 కులాలు. కొన్ని ప్రయోజనాలు పొందిన మద్యస్తంగా ఉన్న వీరికి 9 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి.
గ్రూప్-3: ఎస్సీ జనాభాలో 29.26 శాతం ఉన్న మాల, అయ్యవార్‌తో సహా 26 కులాలు. అన్ని విధాలా ప్రయోజనాలు పొంది మెరుగైన స్థితిలో ఉన్నవీరికి 5 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి.
గ్రూప్-4: ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు తదితర ప్రజా ప్రతినిధులను క్రీమీ లేయర్‌లో చేర్చి వారి తర్వాత తరానికి రిజర్వేషన్లు వర్తింపజేయరాదని కమీషన్ సిఫార్సుని ప్రభుత్వం తిరస్కరించింది.
త్వరలోనే ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల బిల్లుని కూడా శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఈ చట్టాన్ని అమలు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.