న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్.. ఎంత ధైర్యం?

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నత్త నడకలు నడుస్తున్నప్పటికీ దానిలో వెలుగు చూస్తున్న విషయాలు దిగ్బ్రాంతి కలిగించేలా ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్‌ అయి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన భుజంగరావు ల్యాప్‌టాప్‌ లో డేటాని విశ్లేషించి దానిలో వివరాలను శాస్త్రీయంగా నిర్ధారించుకునేందుకు దానిని హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు.

దానిలో తెలంగాణలో వివిద పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్ధులతో సహా తెలంగాణ హైకోర్టులో పనిచేసిన 18 మంది న్యాయమూర్తులు, అవినీతి కేసులపై విచారణ జరిపే ఓ ఏసీబీ న్యాయమూర్తి ఫోన్లు కూడా టాపింగ్ చేసిన్నట్లు కనుగొన్నారు.

ఇటీవల తెలంగాణ హైకోర్టు నుంచి వేరే రాష్ట్ర హైకోర్టుకి, పదోన్నతితో సుప్రీంకోర్టుకి బదిలీ అయిన ఓ న్యాయమూర్తుల ఫోన్లు కూడా టాపింగ్ చేసిన్నట్లు కనుగొన్నారు. వారి ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా వారి పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబ సభ్యులు, బందు మిత్రుల పూర్తి వివరాలు కూడా భుజంగరావు ల్యాప్‌టాప్‌లో ఉండటం చూసి ఫోరెన్సిక్ నిపుణులే ఆశ్చర్యపోయారు. 

ఈ ఫోరెన్సిక్ నివేదికలని పోలీసులు ఛార్జ్-షీట్‌లో చేర్చి కోర్టుకి సమార్పిస్తే న్యాయమూర్తులు ఏవిదంగా స్పందిస్తారో ఊహించుకోవచ్చు.