మాజీ మంత్రి కేటీఆర్ ఎఫ్-1 రేసింగ్ కేసులో ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తన నివాసం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పెద్ద సందేశం పెట్టారు.
ఫార్ములా 1 రేసింగ్ ఈవెంట్ నిర్వహించి ప్రపంచపటంలో హైదరాబాద్కు స్థానం కల్పించానని, తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇది కూడా ఒకటని దానిలో పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి. నగదు బదిలీ అంతా పారదర్శకంగా జరిగింది. ప్రతీ రూపాయికి బ్యాంకుల వద్ద రికార్డ్ ఉంది. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. ఒక్క పైసా కూడా అవినీతి జరుగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఈ తప్పుడు కేసు పెట్టింది. ఇటువంటి కేసులతో తన ఘనతని తగ్గించలేదంటూ కేటీఆర్ పెద్ద సందేశం పెట్టారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..
💥 ఫార్ములా-ఈని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుంది.
— BRS Party (@BRSparty) January 16, 2025
💥 ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది.
💥 ఎన్ని… https://t.co/l3MNPnENYa