కాంగ్రెస్ యువరాజు ఒక్కోసారి అనాలోచితంగా మాట్లాడి నవ్వులపాలవుతుంటారు. రాహుల్ గాంధీ దేశంలో కులగణన జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాని ప్రాతిపదికగా విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే మద్యలో మిస్ ఇండియా జాబితా ప్రస్తావన తెచ్చి నవ్వులపాలయ్యారు. ఆ జాబితాలో బడుగు బలహీనవర్గాలకు చెందిన ఒక్కరూ కనపడరు. ఇది వివక్ష కాదా? అని రాహుల్ గాంధీ ప్రశ్న విని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దీనికి కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు.
రాహుల్ గాంధీజీ... ప్రభుత్వాలు మిస్ ఇండియాని ఎంపిక చేయవు. ప్రభుత్వాలు ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయవు. ప్రభుత్వాలు సినిమాలకు నటీ నటులను ఎంపిక చేయవు. మీ పిల్ల చేష్టలు అందరికీ వినోదం పనుచుతున్న మాట వాస్తవం. కానీ బడుగు బలహీనవర్గాలను మాత్రం ఎగతాళి చేయొద్దు. వారిపేరుతో ఇలా చవుకబారు రాజకీయాలు చేయొద్దు,” అని అన్నారు.
దళిత మహిళ ద్రౌపది ముర్ముని తమ ప్రభుత్వం రాష్ట్రపతిగా చేసిందని, మోడీ మంత్రివర్గంలో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారనే విషయం రాహుల్ గాంధీ గ్రహించాలని హితవు కిరణ్ రిజిజు పలికారు.