ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మీడియాలో ఎంత దుమారం రేగుతున్నప్పటికీ, సామాన్య ప్రజలు ఆ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఎందువల్ల అంటే ఇంతకాలం జీహెచ్ఎంసీ అధికారులు నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్ళు మాత్రమే కూల్చేస్తుండేవారు తప్ప ఇలాంటి పెద్దల భవనాల జోలికి వెళ్ళేవారే కారు కనుక. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ధైర్యంగా ముందుకు సాగుతోందనే అభిప్రాయం సర్వత్రా వినబడుతోంది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి, కేటీఆర్ నివాసం ఉంటున్న జన్వాడలోని బిఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి ఫామ్‌హౌస్, బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫామ్హౌస్లని కూల్చేసేందుకు హైడ్రా అధికారులు సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం.
ఇక మణికొండలోని చిత్రపురిలో అక్రమంగా నిర్మించిన 225 విల్లాలకు హైడ్రా కమీషనర్‌గా ఏవీ రంగనాధ్ నోటీసులు జారీ చేశారు. రెండు వారాలలోగా నోటీసులకి జవాబులు ఇవ్వాలని లేకుంటే విల్లాలు కూల్చివేసేందుకు అభ్యతరం చెప్పన్నట్లే భావిస్తామని నోటీసులలో పేర్కొన్నారు. కనుక హైడ్రా కూల్చివేతలతో రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ పరిణమాలు జరుగబోతాయో చూడాల్సిందే.