తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే 8 నెలలు కావస్తున్నా ఇంకా ప్రభుత్వం కుదుటపడిన్నట్లు లేదు. ఇంకా ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రహసనం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సిఎస్ శాంతి కుమారి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ
• వాణిజ్య పన్నుల కమీషనర్ టికె శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమీషనర్‌గా బదిలీ.
• హకా ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి.
• మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి.
• పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక.
• వాణిజ్య పన్నుల కమీషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు.
• మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ (అదనపు బాద్యతలు): ఉదయ్ కుమార్.
• రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా వికాస్ రాజ్ నియమితులయ్యారు.
• విపత్తుల నిర్వహణ విభాగం సంకుక్త కార్యదర్శి ఎస్. హరీష్‌కి రవాణా, ఆర్ అండ్ బీ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు.