అమెరికా పర్యటనకు బయలుదేరిన సిఎం రేవంత్‌ బృందం

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, కొందరు సీనియర్ అధికారుల బృందం శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరారు.

రేవంత్‌ రెడ్డి బృందం అమెరికా పర్యటన షెడ్యూల్: 

ఆగస్ట్ 4: న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణవాసులతో సమావేశం. వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు  ప్రోత్సహిస్తారు. 

ఆగస్ట్ 5,6: న్యూయార్క్‌లో పెప్సీ కో, హెచ్‌సీఏ కంప్యూటర్స్ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించి, వీలైతే ఒప్పందాలు చేసుకుంటారు. 

ఆగస్ట్ 7:   డల్లాస్ నగరంలో వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ. గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు. 

ఆగస్ట్ 8: శాన్‌ఫ్రాన్సిస్కోలో యాపిల్, ట్రైనేట్ సంస్థల సీఈవోలతో భేటీ అవుతారు. 

ఆగస్ట్ 9: గూగుల్, అమెజాన్ సంస్థల రతినిధులతో భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం ప్రవాస తెలంగాణవాసులతో సమావేశమవుతారు. 

దక్షిణ కొరియాలో పర్యటన షెడ్యూల్: 

ఆగస్ట్ 11: సియోల్ నగరం చేరుకుంటారు. 

ఆగస్ట్ 11,12: ఎల్జీ, శాంసంగ్ తదితర దక్షిణ కొరియా కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. 

ఆగస్ట్ 13: అర్దరాత్రి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు.