బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చా: సిఎం రేవంత్‌

నేడు తెలంగాణ శాసనసభ సమావేశంలో ద్రవ్య వినిమయ బిల్లుపై సిఎం రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌ మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “మొన్న బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్‌ శాసనసభకు వచ్చి మమ్మల్ని చీల్చి చెండాడుతామన్నారు. నేను ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకువచ్చా. మా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న అయితే కేసీఆర్‌ ఏం చేస్తారో చూడాలని అరగంట ముందే శాసనసభకు వచ్చి తన సీటులో కూర్చొని కేసీఆర్‌ కోసం ఎదురు చూశారు. కానీ నేటికీ కేసీఆర్‌ శాసనసభకు రానేలేదు,” అని వ్యంగ్యంగా అన్నారు. 

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు ధీటుగా ముచ్చర్ల వద్ద మరో కొత్త సిటీని ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో పెట్టుబడులు పెట్టాలన్నా, ఐ‌టి కంపెనీలు పెట్టాలన్నా అక్కడికి రావాల్సిందే. మెట్రోతో ముచ్చర్లని హైదరాబాద్‌కి అనుసంధానం చేస్తాము. ముచ్చర్ల అంటే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండబోతోంది. ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ వైపు అడుగులు వేస్తోంది. కనుక ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ కూడా హబ్ ఏర్పాటు చేస్తాము,” అని చెప్పారు.