రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటోంది. దీనిపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చారణా కోడికి... బారాణ మసాలా అంటే ఇదే అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఏడు నెలలుగా ఊరించి... ఊరించి రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులు ఉంటే వారిలో కేవలం 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అర్హులకు ఈ పధకం అందకుండా చేసింది. తమకు ఎందుకు ఈ పధకం వర్తించదో తెలుసుకుందామంటే చెప్పేవాడు లేడు.
రుణమాఫీతో సంతోషపడుతున్న రైతుల కంటే అందక కంట తడిపెడుతున్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు. జూన్‌లో ఇవ్వాల్సిన రైతు భరోసా జూలై వచ్చినా ఇవ్వకుండా దానికి కేటాయించిన నిధులను పంట రుణాలు మాఫీకి మళ్ళించి గొప్పలు చెప్పుకుంటున్నారు. కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15,000 ఏమయ్యాయి? రైతు కూలీలకు ఇస్తామన్న రూ.12,000 ఏమయ్యాయి? ఇంకా ఎంత కాలం ప్రజలను మభ్యపెడతారు?” అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
ఆయన మాటల్లోనే....