అంగన్వాడీలకు శుభవార్త: త్వరలో జీవో జారీ

తెలంగాణలో అంగన్వాడీలకు శుభవార్త మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. హైదరాబాద్‌లోని రహమత్ నగర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క, అనంతరం వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎంత కష్టపడుతున్నారో నాకు బాగా తెలుసు. సమాజంలోని చిన్నారులకు తల్లి, గురువులా శిక్షణ ఇస్తూ మీరు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. 

మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీని గురించి ఇప్పటికే సిఎం రేవంత్‌ రెడ్డితో మాట్లాడి ఒప్పించాము. మీకు రిటైర్‌మెంట్ బెనిఫిట్ కింద టీచర్లకు రూ.2 లక్షలు, ఆయమ్మలకు లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు మూడు రోజులలోనే దీనికి సంబందించి జీవో కూడా విడుదల కాబోతోంది.

మేము మీకు మాట ఇచ్చాం దానిని నిలబెట్టుకుంటాం. కొద్దిగా ఆలస్యమైనా ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రతిపక్షాల దుష్ప్రచారం నమ్మి మన ప్రభుత్వంపై అనుమానాలు, అపోహలు పెంచుకోవద్దు,” అని చెప్పారు.