
బిఆర్ఎస్ పార్టీలో ఈ జూలై నెలలోనే గద్వాల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బిఆర్ఎస్ ఎంపీ కే కేశవ్ రావు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా రాజేంద్రనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.
ఆయన రేపు (శుక్రవారం) సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రకాష్ గౌడ్, సిఎం రేవంత్ రెడ్డి చాలా కాలంగా మంచి స్నేహితులు కావడంతో, రేవంత్ రెడ్డి సిఎం కాగానే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దపడ్డారు. కానీ లోక్‌సభ ఎన్నికల తర్వాత చేరమని సిఎం రేవంత్ రెడ్డి సూచించడంతో ఇంతవరకు ఆగారు.
ప్రకాష్ గౌడ్ పార్టీ మారుతున్నట్లు అప్పుడే సమాచారం అందడంతో బిఐఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో భేటీ అయ్యి బుజ్జగించడంతో బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా లేదా అనే విషయం రేపు తేలిపోతుంది.