రామగుండం విద్యుత్ కేంద్రం మూసివేతకు రంగం సిద్దం

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం-బి ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం త్వరలో మూతపడబోతోంది. దీనిని 1965లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు.

ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీతో దీనిని 62.5 మెగావాట్స్ సామర్ధ్యంతో నిర్మించగా చాలా దాదాపు 20-30 ఏళ్ళు చాలా అద్భుతంగా పనిచేసింది. ఇప్పుడు ఈ ప్లాంట్ అవసాన దశకు చేరుకోవడంతో తరచూ మరమత్తులు వస్తుండటంతో తరచూ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయాలు ఏర్పడుతున్నాయి. 

ఈ నెల 4వ తేదీన విద్యుత్ ప్లాంట్ ట్రిప్ అవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దానిని సరిచేసి మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు విద్యుత్ సౌధ నుంచి అనుమతి రాకపోవడంతో అప్పటి నుంచి రామగుండం ప్లాంటులో పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు ఖాళీగా ఉన్నారు. 

కనుక వారిలో పలువురిని యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లకు బదిలీ చేసింది. పాత ప్లాంట్ స్థానంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీతో 800 మెగావాట్స్ సామర్ధ్యంతో మరో కొత్త ప్లాంట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.