తెలంగాణ లోక్‌సభ ఎన్నికలలో విజేతలు వీరే

తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నప్పటికీ ఫలితాలపై దాదాపు స్పష్ఠత వచ్చేసింది. 

1. నల్గొండ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన కుందూరు రఘువీర్ రెడ్డి 5.59 లక్షల భారీ మెజార్టీతో రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మెజార్టీ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. 

2. ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి రఘురాం రెడ్డి 4.56 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. 

3. జహీరాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధి సురేష్ షెట్కర్ 45,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

4. నాగర్‌కర్నూల్‌లో బిఆర్ఎస్ అభ్యర్ధి ప్రవీణ్ కుమార్‌పై కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్లు రాష్ట్రవ్యాప్తంగా 85,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. 

5. వరంగల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధి కడియం కావ్య 2.02 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

6.పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

7. భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్‌ రెడ్డి 1.95 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

8. మహబూబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి బలరాం నాయక్ 3.24 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

9. సికింద్రాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి విజయం సాధించారు. 

10. కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ 2.12 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

11. మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి సునీతా మహేందర్ రెడ్డిపై 3.86 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 

12. మెదక్‌ బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించడంతో 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ స్థానం బీజేపీకి దక్కింది. 

13. చేవెళ్ళ బీజేపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. 

14. మహబూబ్ నగర్‌ నుంచి బీజేపీ అభ్యర్ధి డికె అరుణ విజయం సాధించారు.

15. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ కుమార్‌ 1.13 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

16. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్ధి గొడం నగేష్ 78,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.    

17. తెలంగాణలో హైదరాబాద్‌ నుంచి మజ్లీస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన అసదుద్దీన్‌  ఓవైసీ దాదాపు 3.38 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 

సికింద్రాబాద్‌ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్ధి నివేదితపై కాంగ్రెస్‌ అభ్యర్ధి గణేశన్ విజయం సాధించారు. అంటే లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఉప ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్న మాట!