కేంద్రంలో పూర్తి మెజార్టీతో బీజేపీయే... పక్కా!

నిన్న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీయే కూటమి పూర్తి మెజార్టీ సాధించబోతోందని స్పష్టం చేశాయి. కనుక మళ్ళీ ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కాబోతున్నారన్న మాట! 

లోక్‌సభలో మొత్తం 543 సీట్లు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి 272 సీట్లు అవసరం. వివిద ఏజన్సీలు ఎన్డీయే కూటమికి భారీ మెజార్టీని సూచిస్తున్నాయి.    

ఏబీపీ-సీఓటర్: ఎన్డీయే: 353-383, ఇండియా కూటమి: 152-182. 

జన్ కీ భారత్‌: ఎన్డీయే: 362-392, ఇండియా కూటమి: 141-151. 

న్యూస్ నేషన్: ఎన్డీయే: 342-378, ఇండియా కూటమి: 153-169.

రిపబ్లిక్ మాట్రీజ్: ఎన్డీయే: 353-368, ఇండియా కూటమి: 118-133.