పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి చేవెళ్ళ నుంచి బీజేపీ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆయనను గెలిపించాల్సిందిగా చేవెళ్ళ ప్రజలను కోరుతూ ఓ వీడియో సందేశం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“కొండా విశ్వేశ్వర్ రెడ్డితో నాకు ఎంతో కాలంగా పరిచయం ఉంది. మంచి స్నేహితుడు. నా కోడలు ఉపాసన ద్వారా బంధుత్వం కూడా ఏర్పడింది. ఆయన చాలా సౌమ్యుడు, ఉత్తముడు. అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. సుదీర రాజకీయ నేపధ్యం నుంచి వచ్చిన ఇలాంటి మంచి వ్యక్తి రాజకీయాలలో ఉండటం చాలా అవసరం. చేవెళ్ళ నియోజకవర్గం అభివృద్ధికి ఆయన ఎంత కృషి చేశారో మీ అందరికీ తెలుసు కనుక మీ అమూల్యమైన ఓటుని ఆయనకే వేసి ఎంపీగా గెలిపించవలసిందిగా చేవెళ్ళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ఆ వీడియో సారాంశం.