తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్న రాహుల్, ప్రియాంక

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం మరో 9 రోజులలో ముగియబోతోంది. కనుక ఎండలు మండిపోతున్నా మూడు ప్రధాన పార్టీలు, అభ్యర్ధులు జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనక తప్పడం లేదు.

ఈసారి ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీల మద్యనే పోటీ ఉంటుందని సర్వేలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున దానికే 10-12 సీట్లు రావచ్చని సర్వేలు సూచిస్తున్నాయి. కానీ బీజేపీ కూడా 10-12 సీట్లు గెలుచుకొని రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. 

ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేకు రాబోతున్నారు. వారు ఈ నెల 5 నుంచి 9వరకు తెలంగాణలో పర్యటిస్తూ రోడ్ షోలు, ఎన్నికల సభలలో పాల్గొంటారు. 

రాహుల్ గాంధీ ఈ నెల 5న నిర్మల్, గద్వాల్ జిల్లాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మళ్ళీ మే 9న కరీంనగర్‌, సరూర్ నగర్‌లో పర్యటించి కరీంనగర్‌, చేవెళ్ళ కాంగ్రెస్‌ అభ్యర్ధులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 

ప్రియాంకా గాంధీ ఈ నెల 6వ తేదీన సికింద్రాబాద్‌, తాండూర్, ఎల్లారెడ్డిలో మర్నాడు కూకట్‌పల్లి, నర్సాపూర్ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు.