ప్రభుత్వం కంటే ప్రజల వైపే ఉండాలనుకుంటాను: విజయశాంతి

రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని రాజకీయ నాయకురాలు విజయశాంతి. ఆమె బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఎన్నికలలో ఆమె సేవలను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలనుకోవడం లేదు. ఆ కారణంగా ఆమె కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారా లేరా?అని అందరికీ సందేహం కలుగుతోంది. 

తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిలో ఆమె తాను ప్రభుత్వం వైపు కంటే ప్రజల వైపు ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతానని, సినిమాలలో తిరుగుబాటు ధోరణి కలిగిన పాత్రల ప్రభావం తనపై ఉన్నట్లు భావిస్తున్నానని విజయశాంతి వ్రాశారు. 

ప్రతిపక్షంలో ఉన్నంత స్వేచ్చ, పోరాటస్పూర్తి అధికార పార్టీలో ఉండకపోవడం కూడా ఇందుకు కారణమేమో?ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాను గత 26 ఏళ్లుగా ఇదే పంధాతో ముందుకు సాగుతున్నానని విజయశాంతి ఆ లేఖలో పేర్కొన్నారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను దశలవారీగా నెరవేర్చి వియవంతంగా పాలన సాగిస్తారని ఆశిస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయశాంతి లేఖలో చూచాయగా అసంతృప్తి కనిపిస్తూనే ఉంది.

రేవంత్‌ రెడ్డి ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తెచ్చుకొని మంత్రి పదవులు కట్టబెడుతున్నప్పుడు, పార్టీలో సీనియర్ నాయకురాలైన విజయశాంతిని పట్టించుకోకపోవడమే బహుశః కారణమై ఉండవచ్చు. ప్రభుత్వంలో కంటే ప్రతిపక్షంలోనే బాగుంటుందని ఆమె చెప్పడం చూస్తే మళ్ళీ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది.

ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే....