ఏపీ సిఎం జగన్‌పై రాయితో దాడి... స్వల్పగాయం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శనివారం రాత్రి విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, జనంలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఆయనపైకి రాయి విసరగా అది తగిలి నుదుటపై చిన్న గాయం అయ్యింది.

ఆయన బస్సుపైన ఏర్పాటు చేసిన వేదికపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యి జగన్‌ను బస్సులోనికి తీసుకుపోయారు. వైద్యులు ఆయనకు ప్రాధమిక చికిత్స చేసీనా తర్వాత జగన్‌ మళ్ళీ రాత్రి 10.30 వరకు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వైద్యుల సూచన మేరకు సిఎం జగన్‌ నేడు బస్సు యాత్ర మానుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్నారు. 

ఎన్నికలలో ఓటమి భయంతో చంద్రబాబు నాయుడే జగన్‌ను అంతమొందించేందుకు ఈ దాడి చేయించారని వైసీపి నేతలు, వారి సొంత మీడియా వాదిస్తోంది. వారి వాదనలను చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు ఖందించారు. ఈ దాడితో తమకు ఎటువంటి సంబందమూ లేదని స్పష్టం చేశారు. జగన్‌పై దాడిని ప్రధాని నరేంద్రమోడీ, కేటీఆర్‌, వైఎస్ షర్మిల తదితరులు ఖండిస్తూ ట్వీట్‌ చేశారు.