హన్మకొండ నయీమ్ నగర్‌ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

వరంగల్‌-హన్మకొండలను కలిపే నయీమ్ నగర్‌ వంతెన శిధిలావస్థకు చేరుకోవడంతో దానిని కూల్చివేసి కొత్త వంతెన నిర్మించబోతున్నారు. కనుక మూడు నెలల పాటు ఈ మార్గాన్ని మూసివేసి వాహనాలను వేరే మార్గాలకు మళ్ళించబోతున్నారు. 

నగరానికి వరద ముంపు నివారించేందుకు కొత్త వంతెన నిర్మాణంతో పాటు వంతెన కింద నాలాను కూడా వెడల్పు చేయబోతున్నారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు నిధులు విడుదల చేసింది. శుక్రవారం వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ తదితరులు ఈ పనులకు శంకుస్థాపన చేస్తారు.  

నయీమ్ నగర్‌ వంతన పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. కనుక అప్పటి వరకు ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోనున్నాయి.