ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్ మీద తిహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో కొత్త కష్టం వచ్చి పడింది.
ఈ కేసులో ఆమెను మళ్ళీ ప్రశ్నించేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అవెన్యూ కోర్టు సీబీఐని అనుమతించింది. అయితే నిబందనలను పాటిస్తూ ఆమెను మహిళా న్యాయవాదుల సమక్షంలో జైల్లోనే ఆమెను ప్రశ్నించాలని న్యాయస్థానం సూచించింది. ఒకటి రెండు రోజులలలో సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులు అప్రూవర్లుగా మారారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్, డెప్యూటీ సిఎం మనిష్ సిసోడియా తదితరులను సీబీఐ అధికారులు ప్రశ్నించి అనేక వివరాలు రాబట్టారు. కనుక వాటి ఆధారంగా కల్వకుంట్ల కవితని ప్రశించే అవకాశం ఉంది.
కల్వకుంట్ల కవితకు ఏప్రిల్ 9వరకు జ్యూడిషియల్ రిమాండ్ ఉంది. ఆమె బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. సోమవారం ఈ కేసు తదుపరి విచారణలో తీర్పు చెపుతామని రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. ఈలోగానే సీబీఐ అధికారులు అదే కోర్టు అనుమతితో ఆమెను ప్రశ్నించేందుకు సిద్దమవుతుండటం విశేషం. ఈశాయి ఆమె చెప్పిన విషయాలను బట్టి సీబీఐ అధికారులు మరో చార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.