లోక్‌సభ ఎన్నికలు: మొదటి విడతకు నోటిఫికేషన్‌ జారీ

ఈసారి 7 దశలలో 44 రోజుల పాటు లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో మొదటి దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొదటి దశలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

తమిళనాడు: 39, రాజస్థాన్: 12, యూపీ:8, మధ్యప్రదేశ్: 6, మహారాష్ట్ర: 5, ఉత్తరాఖండ్: 5, అస్సాం: 5, బిహార్‌:4, పశ్చిమ బెంగాల్: 3, అరుణాచల్ ప్రదేశ్: 2, మణిపూర్:2, మేఘాలయ: 2, ఛత్తీస్‌ఘడ్‌: 1, జమ్మో కశ్మీర్: 1, మిజోరాం:1, నాగాలాండ్:1, సిక్కిం:1, త్రిపుర:1, పుదుచ్చేరి:1, అండమాన్ నికోబార్:1, లక్షద్వీప్‌:1 స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.  

మొదటి దశ ఎన్నికల షెడ్యూల్:

నోటిఫికేషన్‌: మార్చి

నామినేషన్స్‌కు గడువు: మార్చి 27

నామినేషన్స్‌ పరిశీలన: మార్చి 28

నామినేషన్స్‌ ఉపసంహరణ గడువు: మార్చి 30

పోలింగ్: ఏప్రిల్‌ 19

కౌంటింగ్, ఫలితాల వెల్లడి: జూన్ 4.