లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల రెండో జాబితా మంగళవారం రాత్రి విడుదలవుతుందని అందరూ ఎదురు చూసినప్పటికీ ప్రకటించలేదు. ఆదివారం ముంబైలో, మళ్ళీ మంగళవారం ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే అధ్వర్యంలో కాంగ్రెస్ సెలక్షన్ కమిటీ సమావేశమయ్యి అభ్యర్ధుల గురించి సుదీర్గంగా చర్చించింది. దీనిలో తెలంగాణ నుంచి సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
కొన్ని రోజుల క్రితం నలుగురు ఎంపీ అభ్యర్ధులను ప్రకటించగా నిన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మరో ఐదుగురు అభ్యర్ధులను ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. కానీ వారి పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. నేడు (బుధవారం) మళ్ళీ మరోసారి సమావేశమయ్యి చర్చించిన తర్వాత రెండో జాబితా ప్రకటించాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.
మొదటి జాబితాలో అభ్యర్ధులు:
1. నల్గొండ: కె.రఘువీర్ రెడ్డి
2. జహీరాబాద్: సురేష్ షెట్కర్
3. మహబూబ్ నగర్: వంశీ చంద్ రెడ్డి
4. మహబూబాబాద్: బలరాం నాయక్
రెండవ జాబితాలో అభ్యర్ధులు :
5. చేవెళ్ళ: రంజిత్ రెడ్డి
6. మల్కాజ్‌గిరి: సునీతా మహేందర్ రెడ్డి
7. నాగర్‌కర్నూల్: మల్లు రవి
8. పెద్దపల్లి: గడ్డం వంశీ
9. కరీంనగర్: ప్రవీణ్ రెడ్డి
10. అదిలాబాద్: డాక్టర్ సుమలత
11. నిజామాబాద్: జీవన్ రెడ్డి
12. వరంగల్: పసునూరి దయాకర్.