మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌ బిఆర్ఎస్ అభ్యర్ధులు ఖరారు

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించిన తర్వాత మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌ ఎంపీ స్థానాలకు బిఆర్ఎస్ అభ్యర్ధులను ఖరారు చేశారు. మల్కాజ్‌గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సక్కు పోటీ చేయబోతున్నారని బిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 11 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించిన్నట్లయింది. మిగిలిన 6 స్థానాలలో రెండు బీఎస్పీకి కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. కనుక బిఆర్ఎస్ పార్టీ మరో 4 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంటుంది. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల వివరాలు: