టిఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త: 21శాతం ఫిట్‌మెంట్

టిఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ శుభవార్త చెప్పారు. టిఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. టిఎస్‌ఆర్టీసీలో మొత్తం 53,071 మంది ఉద్యోగులకు దీని వలన ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. దీని వలన టిఎస్‌ఆర్టీసీపై నెలకు సుమారు రూ.35 కోట్లు, ఏడాదికి సుమారు రూ.420 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. 

మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో టిఎస్‌ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపిస్తుండటంతో బస్సులలో ప్రయాణించే మహిళలు సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. పెరిగిన రద్దీని తట్టుకునేందుకు త్వరలోనే మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేయబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.