తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధుల జాబితా సిద్దం

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో 17 స్థానాలకు బీజేపీ 9, బిఆర్ఎస్ పార్టీ నలుగురు అభ్యర్ధులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై ఢిల్లీలో కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన సెలక్షన్ కమిటీ సమావేశం కాబోతోంది. దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పాల్గొనబోతున్నారు. ఒకవేళ ఈరోజు అభ్యర్ధులను ఖరారు చేస్తే నేడే జాబితా ప్రకటించే అవకాశం ఉంది. సెంట్రల్ సెలక్షన్ కమిటీ పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే: