తెలంగాణలో రైతు నేస్తం ప్రారంభం

తెలంగాణలో రైతులకు సాయపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు నేస్తం’ అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. దీనిని సిఎం రేవంత్‌ రెడ్డి బుధవారం సచివాలయంలో తన కార్యాలయం నుంచి ప్రారంభించి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. 

శాసనసభ నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్‌గా పరిగణిస్తూ రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఈ సౌకర్యం కల్పిస్తోంది. తొలిదశలో రాష్ట్రంలో రైతువేదికలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని 2,601 రైతు వేదికలని దీంతో అనుసంధానం చేస్తారు.

గ్రామాలలో రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా రైతు వేదికల వద్ద నుంచే రైతు నేస్తం కార్యక్రమం ద్వారా సంబందిత అధికారులు, మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. అలాగే రైతులు నేరుగా వ్యవసాయ నిపుణులతో మాట్లాడి తన పంటలకు సంబంధించి సలహాలు, సూచనలు పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం వంద కోట్లు ఖర్చు చేస్తోంది.