కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో ఒకటైన గృహజ్యోతి పధకం కింద తెలంగాణ ప్రభుత్వం మార్చి నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తోంది. రాష్ట్రంలో 39.9 లక్షల కుటుంబాలు ఈ పధకానికి అర్హులుగా ప్రభుత్వం గురించింది. కానీ వారిలో పది లక్షల మంది మాత్రమే ఈ పధకాన్ని వర్తింపజేయగలిగారు విద్యుత్ శాఖ.
మిగిలినవారు ఆహార భద్రత కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ నంబర్లు తదితర వివరాలను నమోదు చేసుకున్నప్పుడు దరఖాస్తులలో తప్పులు దొర్లడం వలన గృహజ్యోతి పధకం పొందలేకపోయారు. వారు పూర్తి వివరాలతో మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఏప్రిల్ నుంచి గృహజ్యోతి పధకం కింద జీరో బిల్స్ జారీ చేసి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గృహజ్యోతి పధకం ప్రారంభం కాలేదు. మార్చి 28న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తవుతుంది.
కానీ ఈ ఎన్నికల కోడ్ ముగిసేలోగానే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. మే రెండో వారానికి ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. కనుక మార్చి నెలలో గృహజ్యోతి పధకం పొందలేకపోయిన వారికి జూన్ వరకు పొందే అవకాశం ఉండకపోవచ్చు.