మహబూబ్ నగర్‌ బిఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు

ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో మహబూబ్ నగర్‌ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో సమావేశమై చర్చించిన తర్వాత అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పేరునే ఖరారు చేశారు. 

బిఆర్ఎస్ పార్టీ నిన్న కరీంనగర్‌: బి.వినోద్ కుమార్‌, పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్, ఖమ్మం: నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్: మాలోత్ కవితలను అభ్యర్ధులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

నేడు అనూహ్యంగా బిఆర్ఎస్‌, బీఎస్పీల మద్య నేడు పొత్తు కుదరడంతో, బీఎస్పీకి కూడా ఒకటి రెండు సీట్లు కేటాయించే అవకాశం ఉంది.  వాటిలో నాగర్‌కర్నూల్‌ నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్‌ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఇద్దరు ఎంపీలు బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి, ఎంపీ పి.రాములు కుమారుడు పి.భరత్ నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేయబోతున్నారు. ఇది బిఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది. కనుక ఆ మూడు నియోజకవర్గాలను లేదా వాటిలో ఒకటి రెండు బీఎస్పీకి అప్పగించే అవకాశం ఉంది.