త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో బీజేపీ అభ్యర్ధుల పేర్లు దాదాపు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన కొందరికి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణ బీజేపీ అభ్యర్ధుల జాబితా ప్రకటించనుంది. ఆ జాబితాలో ఉన్నవారి పేర్లు:
హైదరాబాద్: టి.రాజసింగ్, మాధవీలత, భగవంత రావు,
సికింద్రాబాద్: కిషన్ రెడ్డి,
కరీంనగర్: బండి సంజయ్,
పెద్దపల్లి: టి.కుమార్
నిజామాబాద్: ధర్మపురి అరవింద్,
మల్కాజ్‌గిరి: ఈటల రాజేందర్, మురళీధర్ రావు, చాడ సురేశ్ రెడ్డి, టి.వీరేందర్ గౌడ్, పొన్నాల హరీష్ రెడ్డి,
మెదక్: ఎం.రఘునందన్ రావు, జి.అంజిరెడ్డి,
చేవెళ్ళ: కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండారు దత్తాత్రేయ వియ్యంకుడు బి.జనార్ధన్ రెడ్డి,
వరంగల్: మాజీ డిజిపి కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి,
నల్గొండ: మన్నే రంజిత్ యాదవ్
భువనగిరి: బి.నర్సయ్య గౌడ్, జి.మనోహర్ రెడ్డి, కాశం వెంకటేశ్వర్లు యాద్వ్,
ఖమ్మం: దేవకీ వాసుదేవరావు, వినోద్ రావు, రంగా కిరణ్,
నాగర్‌కర్నూల్: బంగారు శ్రుతి, కేఎస్: రత్నం,
మహబూబ్ నగర్: డికె అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి, శాంత కుమార్,
మహబూబాబాద్: హుస్సేన్ నాయక్
జహీరాబాద్: ఎం.జైపాల్ రెడ్డి, ఆలె భాస్కర్, అశోక్ ముస్తారపు
ఆదిలాబాద్: సోయం బాపురావు, బాపూరావు రాథోడ్, గూడెం నగేష్.