ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, వాటితో పాటు లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ బృందం అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తోంది. చివరిగా మార్చి 12-13 తేదీలలో జమ్ముకశ్మీర్‌లో పర్యటించబోతున్నారు. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
గత లోక్‌సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ ప్రకటించి, ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించింది. మే 23న ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి వెంట వెంటనే ఫలితాలు ప్రకటించింది. ఈసారి కాస్త ముందుగా ఎన్నికలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇంచుమించు అదే సమయంలో ఎన్నికలు జరిగే సూచనలు కనబడుతున్నాయి.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు, ఏపీలో 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి.