కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ శనివారం భువనేశ్వర్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, వాటితో పాటు లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాజీవ్ కుమార్ చెప్పారు.
ఒడిశాలోని సుమారు 50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ సదుపాయం చేశామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులందరూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలని రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు పోలీసులు, భద్రతా సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆవంచనేయీ ఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాలకు సంబందించి తెలంగాణలో 17, ఆంధ్రాలో 25 లోక్‌సభ స్థానాలకు, ఏపీ శాసనసభలో 175 స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి.
తెలంగాణలో ఈసారి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య ప్రధానంగా పోటీ ఉండవచ్చు. కానీ బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునే ప్రయత్నం చేసేందుకు సిద్దం అవుతోంది. కనుక లోక్‌సభ ఎన్నికలు కూడా హోరాహోరీగా జరుగబోతున్నాయి.
ఏపీలో అధికార వైసీపి ఒక్కటీ ఒక్కవైపు, టిడిపి, జనసేనలు మరోవైపు నిలిచి పోటీ చేయబోతున్నాయి. టిడిపి, జనసేనలతో సీట్ల సర్దుబాట్లు జరిగితే బీజేపీ కూడా వాటితో కలిసి పోటీ చేస్తుంది. లేకుంటే ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది.