ఒకప్పుడు సినిమాలలో హాస్యనటుడిగా తెలుగు ప్రజలందరినీ ఎంతగానో మెప్పించిన బాబూ మోహన్ రాజకీయాలలో కూడా అవకాశాలు వస్తున్నా రాణించలేక తానే నవ్వులపాలవుతున్నారు. ఇదివరకు బిఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు బీజేపీలో కూడా తనకు సరైన గౌరవం లభించడం లేదంటూ పార్టీ వీడారు.
హైదరాబాద్, సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా అనేక గ్రూపులు ఉన్నాయి. నేను వాటికి దూరంగా ఉంటుండటంతో, నాపై వారితో విమర్శలు చేయిస్తున్నారు. పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితి, జరుగుతున్న పరిణామాలు నాకు నచ్చడం లేదు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలనుకుని మా అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఎట్టలేదు. దీనిని నేను అవమానంగానే భావిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇదే విషయాలు నా రాజీనామాలో పేర్కొంటూ ఆ లేఖను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపిస్తున్నాను,” అని బాబూ మోహన్ చెప్పారు.