తెలంగాణ బీజేపీలో టికెట్ల కోసం పోటీ దేనికంటే...

కేసీఆర్‌ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రాష్ట్రంలో అన్ని పార్టీలకు చాలా మేలు చేశారని చెప్పవచ్చు. అప్పటి నుంచి ముందు శాసనసభ ఎన్నికలు, మూడు నాలుగు నెలల తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

కనుక శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినవారికి వెంటనే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే వెసులుబాటు లభిస్తోంది. ఈసారి కూడా అదే జరుగబోతోంది. శాసనసభ ఎన్నికలలో మూడు ప్రధాన పార్టీలలో చాలా మంది ఓడిపోయారు. కనుక వారందరూ మళ్ళీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో’ జాతీయస్థాయి అంశాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక బిఆర్ఎస్ పార్టీతో పోలిస్తే జాతీయపార్టీలైన కాంగ్రెస్‌,  బీజేపీలకు ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. కనుక రెండు పార్టీలలో టికెట్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. 

శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన డికె అరుణ, ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు వంటివారితో సహా పలువురు మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. 

బీజేపీలో లోక్‌సభ టికెట్‌ కోసం పోటీ పడుతున్నవారు: 

చేవెళ్ళ: కొండా విశ్వేశ్వర్ రెడ్డి, దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్. 

మహబూబ్ నగర్‌: డికె అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిమ్ టి.ఆచారి. 

మల్కాజ్‌గిరి: ఈటల రాజేందర్‌, పి.మురళీధర్ రావు, ఎన్‌. రామచందర్ రావు, కూన శ్రీశైలం గౌడ్, డా.ఎస్. మల్లారెడ్డి, టి.వీరేందర్ గౌడ్, సామ రంగారెడ్డి, హరీష్ శంకర్‌ రెడ్డి. 

వరంగల్: మంద కృష్ణ మాదిగ (టికెట్‌ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం).