ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఆడవాళ్ళు అందరూ నా అక్కచెల్లెమ్మలే అంటుంటారు. కానీ సొంత చెల్లి వైఎస్ షర్మిల, మరో చెల్లి (బాబాయ్ వివేకా కూతురు) సునీతారెడ్డి ఇద్దరూ దుష్టులు, దుర్మార్గులు, తనను గద్దె దించడానికి శత్రుమూకలతో చేతులు కలిపి కుట్రలు పన్నుతున్నారంటూ వైసీపి నేతల చేత విమర్శలు చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వారిద్దరిని వైసీపి మూకలు ట్రోలింగ్ చేస్తూనే ఉన్నాయి.
దీనిపై సునీతా రెడ్డి స్పందిస్తూ, “జగన్మోహన్ రెడ్డి నాకు రక్తసంబంధం వలన అన్న అవుతాడు. కానీ సోషల్ మీడియాలో వైసీపి శ్రేణులు నాపాలిట కాలాకేయ సైన్యంలా తయారయ్యారు. సొంత చెల్లిని, కుటుంబంలో ఆడవారినే ఇంతగా వేదిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తారు? చేస్తారని ఎలా ఆశించగలము?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వారిరువురినీ వైసీపి మూకలు వేటాడుతున్న తీరు చూసి, టిడిపి సీనియర్ నేత “సొంత బాబాయ్ వివేకానే లేపేసిన వారికి నన్ను లేపేయడం ఓ లెక్కా?వైఎస్ షర్మిల ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది. కనుక తక్షణం భద్రత పెంచాలని ఆమె డీజిపీని కోరాలి,” అని హితవు పలికారు.