ఎల్‌కె అద్వానీకి భారతరత్న అవార్డు!

కేంద్ర ప్రభుత్వం బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ (96)కి భారతరత్న అవార్డు ప్రకటించింది. ఈవిషయం ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. “శ్రీ లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న అవార్డు ఇస్తున్నట్లు తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఆయనతో మాట్లాడి ఈవిషయం తెలియజేసి అభినందించాను. 

ఆయన దేశ రాజకీయాలలో అత్యంత గౌరవనీయమైన రాజనీతిజ్ఞుడు, దేశాభివృద్ధికి ఎంతగానో కృషి చేసినవారు. దశాబ్ధాలుగా అద్వానీజీ అత్యంత పారదర్శకత్వంగా నిబద్దతతో పని చేస్తూ రాజకీయాలలో నైతిక విలువలకు నిదర్శనంగా నిలిచారు. 

ఆయన దేశ సమగ్రతకు, సాంస్కృతిక పునరుద్దరణకు ఎంతగానో కృషి చేశారు. కనుక ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటిస్తున్నప్పుడు నేను చాలా భావోద్వేగంతో పొంగిపోయాను. ఆయనతో కలిసి పనిచేస్తూ చాలా విషయాలు నేర్చుకునే అవకాశం లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను,” అంటూ ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్‌ చేశారు.