తమిళనాడులో సినిమా హీరోలు రాజకీయాలపై చాలా ఆసక్తి ఎక్కువ. ఎంజీ రామచంద్రన్, జయలలిత కోలీవుడ్‌ని, తమిళనాడు రాజకీయాలను ఎంతగా శాసించారో అందరికీ తెలుసు. అలాగే ఇటీవల కన్నుమూసిన ప్రముఖ సినీ నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ కూడా సొంత పార్టీ ఉంది.
రెండు మూడేళ్ళ క్రితం ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా సొంత పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించగా, ఇప్పుడు తాజాగా మరో హీరో దళపతి విజయ్ కూడా ‘తమిళిగ వెట్రీ కళగం’ అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
తమిళనాడులో అవినీతిపాలన సాగుతోందని, దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఓ రాజకీయ వేదిక అవసరమని భావించినందునే ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు విజయ్ తెలిపారు. త్వరలో జరుగబోయే ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయదని 2026లో జరిగే శాసనసభ ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తుందని విజయ్ తెలిపారు. త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో అన్ని పార్టీలకు దూరంగా ఉంటామని చెప్పారు.