బడ్జెట్‌లో వరాలు లేవు... వాతలు లేవు!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. కనుక ఇది ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అయినప్పటికీ దీనిలో సామాన్య, మద్యతరగతి ప్రజలకు ఎటువంటి వరాలు ప్రకటించలేదు. అలాగే కొత్తగా వాతలు కూడా వేయలేదు.

ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయపన్ను రాయితీ పరిమితిని ఈసారి రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతారని అందరూ ఎదురుచూశారు. కానీ ఎటువంటి మార్పు చేయలేదు.   

తాజా బడ్జెట్‌లో వివిద రంగాలకు కేటాయింపులు ఈవిదంగా ఉన్నాయి: 

రక్షణ రంగానికి: రూ.6.2 లక్షల కోట్లు

ఉపరితల రవాణా, జాతీయ రహదారులు: రూ.2.78 కోట్లు 

రైల్వే శాఖ బడ్జెట్‌: రూ.2.55 లక్షల కోట్లు

హోంశాఖకు: రూ.2.03 లక్షల కోట్లు

గ్రామీణాభివృద్ధికి: రూ.1.77 లక్షల కోట్లు

రసాయనాలు, ఎరువురులు: రూ.1.68 లక్షల కోట్లు

కమ్యూనికేషన్స్: రూ.1.37 లక్షల కోట్లు

వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ.1.27 లక్షల కోట్లు.