బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతీరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయలేదంటూ ఆమె చేసిన విమర్శలపై స్పందిస్తూ, “పదేళ్లుగా రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?అప్పుడు మీకుఫూలే విగ్రహం ఏర్పాటు చేయలని గుర్తు లేదు. కానీ మేము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ఫూలే విగ్రహం ఏర్పాటు చేయలేకపోయామంటూ కల్వకుంట్ల కవిత రాజకీయాలు చేస్తున్నారు.
మీరు బడుగు బలహీన వర్గాల ప్రజలను ఓటు బ్యాంకుగానే భావిస్తారు తప్ప వారి సంక్షేమం పట్ల మీ పార్టీకి చిత్తశుద్ధి లేదు. అందుకే మీ ప్రభుత్వం ఫూలే విగ్రహం ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు హడావుడి లేకపోవడంతో కల్వకుంట్ల కవితకు తీరిక దొరికిన్నట్లుంది. అందుకే ఇప్పుడు ఆమెకు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే విషయం గుర్తుకు వచ్చిన్నట్లుంది.
మీకు గుర్తులేకపోయినా మాకు ఎల్లప్పుడూ గుర్తుంది. అందుకే మేము అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేయించబోతున్నాము. కనుక కల్వకుంట్ల కవిత విగ్రహ రాజకీయాలు చేయడం మానుకుంటే మంచిది,” అని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.