ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న ఓ భారీ సొరంగమార్గం బయటపడింది. భద్రతాదళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నప్పుడు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడకు, సరిహద్దులోని కర్ణాటకలోని బీజాపూర్ మద్య ఈ సొరంగాన్ని కనుగొన్నారు.
రెండు రాష్ట్రాల మద్య రహస్యంగా రాకపోకలు సాగించేందుకు, భద్రతాదళాలు దాడులు చేసినప్పుడు తప్పించుకుని పారిపోయేందుకు లేదా దాక్కొనేందుకు, శిక్షణ కోసం మావోయిస్టులు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించుకుని ఉండవచ్చని దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ అభిప్రాయపడుతున్నారు.
అటు కర్ణాటకలో, ఇటు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో భద్రతాదళాలు తరచూ గాలిస్తుండటంతో, వారి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ఇటీవలే ఈ సొరంగ మార్గాన్ని నిర్మించుకుని ఉండవచ్చని అన్నారు. ఈ సొరంగమార్గాన్ని మళ్ళీ మావోయిస్టులు వినియోగించుకోకుండా ధ్వంసం చేసామని ఎస్పీ గౌరవ్ రాయ్ మీడియాకు తెలియజేశారు.
అయితే భద్రతా దళాలకు తెలియకుండా మావోయిస్టులు సుమారు కిలోమీటరు పొడవు సొరంగ మార్గం నిర్మించుకోవడం చాలా ఆశ్చర్యకరమే. ఈ సొరంగమార్గం వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
#WATCH | Chhattisgarh: Visuals from a tunnel dug by Naxalites to be used as a bunker, in Dantewada.
— ANI (@ANI) January 31, 2024
(Source: Dantewada Police) pic.twitter.com/04gRKCtWYl