ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ ఇచ్చి గౌరవించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆయన విగ్రహం ఏర్పాటుకి ఆమోదం తెలిపి ఆయన పట్ల గౌరవాన్ని మరోసారి చాటుకుంది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని రామచంద్రాపురం జంక్షన్ వద్ద గద్దర్ విగ్రహం ఏర్పాటుకి తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్ఎండీఏ పాలక మండలి ఆమోదించింది. రామచంద్రాపురంలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకి 1,076 చ.గజాల స్థలాన్ని మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గద్దర్ జీవితం తెరిచిన పుస్తకం వంటిది. ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన గత ఏడాది ఆగస్ట్ 6వ తేదీన కన్ను మూశారు. ఆయన చివరి దశలో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేందుకు ప్రయత్నించారు కానీ సఫలం కాలేకపోయారు. కానీ కాంగ్రెస్ నేతలకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన కుమార్తె వెన్నెలకు శాసనసభ ఎన్నికలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ ఇచ్చినప్పటికీ ఆమె ఓడిపోయారు.