ట్రాన్స్‌కో, జెన్‌కోలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నిబంధనలకు విరుద్దంగా ఈ రెండు సంస్థలలో డైరెక్టర్లుగా తిష్ట వేసుకున్నవారిని అందరినీ బయటకు సాగనంపాలని సిఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీని ఆదేశించారు. కేసీఆర్ హయాంలో నియమితులైన 11 మంది డైరెక్టర్లు నేటికీ తమ పదవులలో కొనసాగుతున్నారు.
జీవో:18/2012 ప్రకారం ఈ రెండు సంస్థలలో డైరెక్టర్ల పదవీకాలం రెండు ఏళ్ళు ఉంటుంది. అవసరమైతే మరో ఏడాది చొప్పున రెండు సార్లు పొడిగించవచ్చు. అంటే గరిష్టంగా 4 ఏళ్ళు మాత్రమే పదవిలో కొనసాగించవచ్చు.
కానీ కేసీఆర్ ప్రభుత్వం 2019లో జారీచేసిన జీవో: 29లో వారికి మరింత వెసులుబాటు కల్పిస్తూ, ‘తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు’ కొనసాగవచ్చనే క్లాజ్ చేచింది. దాంతో 11 మంది డైరెక్టర్లు గత 9 ఏళ్ళుగా తమ పదవులలో కొనసాగుతున్నారు. వారందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటకు సాగనంపి, వారి స్థానాలలో కొత్త డైరెక్టర్లను నియమించబోతోంది.
ట్రాన్స్‌కోలో 9 ఏళ్ళుగా డైరెక్టర్లుగా కొనసాగుతున్నవారి వివరాలు:
1. జి.నర్శింగ్ రావు: ప్రాజెక్ట్ డైరెక్టర్
2. టి.జగత్ రెడ్డి: ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్
3. జె. సూర్యప్రకాశ్: లిఫ్ట్ ఇరిగేషన్ డైరెక్టర్
4. బి.నర్శింగ్ రావు: గృడ్స్ ఆపరేషన్స్ డైరెక్టర్
5. సి.శ్రీనివాస్ రావు: జాయింట్ ఎండీ
జెన్‌కో డైరెక్టర్స్:
1. సిహెచ్. వెంకట రాజం: హైడల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్
2. ఎం. సచ్చిదానందం: ప్రాజెక్ట్ డైరెక్టర్
3. ఎస్.అశోక్ కుమార్: హెచ్ఆర్ డైరెక్టర్
4. బి.లక్ష్మయ్య: ధర్మల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్
5. టిఆర్‌కె రావు: కమర్షియల్ డైరెక్టర్
6. ఏ అజయ్: సివిల్ డైరెక్టర్.