కాంగ్రెస్ ఎన్నికల హామీలలో కళ్యాణ్ లక్ష్మీ, షాదీ ముబారక్ సంక్షేమ పధకాలలో నగదుతో పాటు నూతన వధువుకి ఒక తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని కూడా అమలుచేసేందుకు తగిన ప్రణాళిక రూపొందించమని సిఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నగదు ఇవ్వడంలో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు కానీ బంగారం కానుకగా ఇవ్వాలంటే, అది ఏ రూపంలో ఇవ్వాలి? ఏవిదంగా కొనాలి? ఎక్కడి నుంచి కొనాలి? ఎంత కొనాలి? ఎప్పుడు కొనాలి? కొన్న బంగారాన్ని ఏవిదంగా భద్రపరచాలి?
బంగారు ఆభరణం ఇవ్వడం మంచిదా లేకుంటే ఆభరణం కొనుగోలుకి కూడా వేరేగా నగదు ఇచ్చేస్తే మంచిదా?వంటి అనేక అంశాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. లేకుంటే దీనిలో భారీగా అవకతవకలు జరిగే ప్రమాదం... ఆ తర్వాత కేసులు, న్యాయపోరాటాలు, ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు వంటి అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఏది ఏమైనప్పటికీ ఈ పధకాన్ని కూడా లోక్‌సభ ఎన్నికలలోగానే అమలుచేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.