తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో టికెట్స్, మంత్రి పదవులు దొరకనివారు, పార్టీలో సీనియర్లు, పార్టీ గెలుపు కోసం పనిచేసినవారు ఇంకా చాలామంది పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరినీ తృప్తి పరచకపోతే లోక్‌సభ ఎన్నికలలో వారి వలన నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
కనుక సిఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో వారందరికీ చోటు కల్పించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ముందుగా పార్టీలో సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, హెచ్.వేణుగోపాల్ రావులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. సలహాదారులు ముగ్గురికీ క్యాబినెట్ హోదా కూడా కల్పించారు.
డాక్టర్ మల్లురవికి ఢిల్లీలో బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు:
వేం నరేందర్ రెడ్డి: ముఖ్యమంత్రి సలహాదారు.
షబ్బీర్ అలీ: (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వెల్ఫేర్)
హెచ్.వేణుగోపాల్ రావు: ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్)
డాక్టర్ మల్లురవి: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి.