సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. ఆయన ఖమ్మంలోని తన నివాసంలో ఉన్నప్పుడే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అక్కడి వైద్యులు ఆయనకు ప్రాధమిక చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించాలని సూచించారు. వారి సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే అంబులెన్సులో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. 

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో తమ్మినేని వీరభద్రంకు ఖమ్మం జిల్లా పాలర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.