బెల్లంపల్లిలో 19 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామా

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మునిసిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పార్టీకి చెందిన 19 మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేశారు. ఇవాళ్ళ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఛైర్ పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్ ఛైర్ పర్సన్‌ బత్తుల సుదర్శన్‌లను గద్దె దించడానికి వారు సిద్దమయ్యారు. వారిలో జక్కుల శ్వేతతో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మిగిలినవారు కూడా నేడు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు సిద్దపడుతున్నారు.     

బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉండగా వాటిలో బిఆర్ఎస్ 21, కాంగ్రెస్‌ 11, బీజేపీ ఒక కౌన్సిలర్లు ఉన్నారు. ఒక కౌన్సిలర్ మృతి చెందారు. 

తాజా రాజీనామాలతో బెల్లంపల్లి పాలకమండలిలో బిఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా కాంగ్రెస్‌ బలం ఒకేసారి 11 నుంచి 32కి పెరగబోతోంది.