టిఎస్‌ఆర్టీసీలో మళ్ళీ పదేళ్ళ తర్వాత కారుణ్య నియామకాలు చేపట్టబోతోంది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం మేరకు టిఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కోటాలో మొత్తం 813 మంది కండక్టర్లను టిఎస్‌ఆర్టీసీ భర్తీ చేసుకోబోతోంది. విధి నిర్వహణలో ఉండగా మరణించిన సిబ్బంది లేదా తీవ్ర అనారోగ్య కారణంగా ఉద్యోగాల నుంచి తప్పుకున్నవారి పిల్లలను లేదా జీవిత భాగస్వామిని ఈ ఉద్యోగాలలోకి తీసుకోబోతోంది. దీంతో పదేళ్ళ తర్వాత తొలిసారిగా టిఎస్‌ఆర్టీసీ కారుణ్య నియామకాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ రీజియన్లో 66, సికింద్రాబాద్-126, రంగారెడ్డి-52, మెదక్-93, నల్గొండ-56, వరంగల్- 99, కరీంనగర్-45, మహబూబ్ నగర్-83, నిజామాబాద్-69, ఆదిలాబాద్-71, ఖమ్మం-53, మంది కలిపి మొత్తం 813 మందిని టిఎస్‌ఆర్టీసీ ఉద్యోగాలలోకి తీసుకోబోతోంది.