టిఎస్‌పీఎస్సీ రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదముద్ర

తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే టిఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో సహా ఐదుగురు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వాటిని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం ఆమోదించారు. ఉద్యోగాల భర్తీకి టిఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలలో అనేక అవకతవకలు జరగడంతో వారి రాజీనామాలను ఆమోదించాలా వద్దా? అని న్యాయ సలహాలు తీసుకునేందుకు గవర్నర్‌ ఇన్ని రోజులు వారి రాజీనామాలను ఆమోదించలేదు. న్యాయ నిపుణుల సలహా మేరకు నేడు ఆమె వారి రాజీనామాలు అందిస్తున్నట్లు రాజ్‌భవన్‌ ప్రకటించింది. 

వారి రాజీనామాలను ఆమె ఆమోదించగానే టిఎస్‌పీఎస్సీకి ఛైర్మన్‌, 10మందితో కూడిన పాలకమండలిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం రేవంత్‌ రెడ్డి ఇటీవలే చెప్పారు. కనుక త్వరలో వారిని నియమిస్తే వారి అధ్వర్యంలో టిఎస్‌పీఎస్సీ మిగిలిన పరీక్షలను నిర్వహిస్తుంది.